Telangana

గీతం స్కాలర్ పుష్ప మాచానికి పీహెచ్ డీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్ధిని పుష్ప మాచానీని డాక్టరేట్ వరించింది. ‘పారిశ్రామికవేత్తల విజయంపె క్లిష్టమెనై విజయ కారకాల ప్రభావం: తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రత్యేక అధ్యయనం’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని డాక్టర్ సి.నాగప్రియ, ప్రొఫెసర్ వె.లక్ష్మణ్ కుమార్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేఘాలయలోని ఐఐయం షిల్లాంగ్ కు చెందిన ప్రొఫెసర్ సరినీధన త్రిపాఠి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు. పుష్ప పరిశోధన తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై నిర్దిష్ట దృష్టితో పారిశ్రామిక వేత్తల విజయాన్ని ప్రభావితం చేసే క్లిష్టమైన విజయ కారకాలను విశ్లేషించడం లక్ష్యంగా సాగిందన్నారు. ‘ప్రభుత్వ అంశం’, ‘సాంకేతిక అంశం’, ‘సామాజిక అంశాల’ వంటివి చిన్నతరహా సంస్థల పారిశ్రామికవేత్తలను ప్రభావితం చేయ డంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం గుర్తించినట్టు పేర్కొన్నారు. సూక్ష్మ వ్యవస్థాపకులు ‘మేనేజ్మెంట్ ఫ్యాక్టర్’, ‘మార్కెట్-సంబంధిత అంశం’ పట్ల గణనీయమైన ఆకర్షణను కనబరిచినట్టు తెలిపారు. మధ్య తరహా వ్యవస్థాపకులు ‘ఆర్ధిక కారకం’, ‘వ్యక్తిగత కారకం’ కోసం ప్రాధాన్యతను ప్రదర్శించారన్నారు. పుష్ప సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago