లాంఛనంగా ప్రారంభించిన మహీంద్రా సీనియర్ జీఎం అనిల్ కుమార్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లో రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లాబొరేటరీని జహీరాబాద్ లోని మహీంద్రా & మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ప్లాంటు అధిపతి, సీనియర్ జనరల్ మేనేజర్ (తయారీ) అనిల్ కుమార్ మహేంద్రకర్ శుక్రవారం ప్రారంభించారు.స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ల్యాబ్ భావనను మహేంద్రకర్ ప్రశంసించడమే గాక, పారిశ్రామిక అనువర్తనాలతో విద్యాభ్యాసాన్ని అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిపుణుల ఉపన్యాసాలు, ఆచరణాత్మక శిక్షణను అందించడానికి మహీంద్రా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను కూడా ఇక్కడకు పంపుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తమ పారిశ్రామిక ఉత్పత్తులను స్వయంగా పరిశీలించి, ఉత్పత్తి సంస్థను సందర్శించిన అనుభూతిని సొంతం చేసుకోవడానికి గీతం విద్యార్థులు తమ కర్మాగారాన్ని సందర్శించాలని ఆయన ఆహ్వానించారు.
గీతంతో అంకురించిన అనుబంధాన్ని మహేంద్రకర్ గుర్తుచేసుకుంటూ, తమ ప్లాంట్ లో ఫ్యాకల్టీ ఇంటర్న్ షిప్ కోసం గీతం అధికారులు తమను సంప్రదించినప్పుడు, తొలుత ఒకింత విస్మయానికి గురయ్యామని చెప్పారు. రెండు బ్యాచులుగా గీతం అధ్యాపకులు తమ వద్ద శిక్షణ పొందారని, వారికి తమ పరిశ్రమపై లోతైన అవగాహన ఏర్పడడంతో పాటు, మెరుగైన విద్యా దృక్పథాలు వచ్చాయన్నారు. ఇది తమకు కూడా ఉపకరిస్తుందన్న విశ్వాసం వెలిబుచ్చారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, కోర్ ఇంజనీరింగ్ మాజీ డీన్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అంతర్ విభాగ అధ్యయనం, ఆవిష్కరణ, పరిశోధనల కోసం ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వారు విద్యార్థులను ప్రోత్సహించారు.
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం స్థాపించిన ఈ ప్రయోగశాల, రోబోటిక్ వ్యవస్థల రూపకల్పన, ప్రోగ్రామింగ్, నిర్వహణలో విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం ద్వారా రోబోటిక్స్, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ తయారీలో ఆచరణాత్మక అభ్యాసం, పరిశోధనలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. శ్రీనివాస్, రోబోటిక్స్-ఏఐ లాబొరేటరీ ప్రొఫెసర్ ఇన్ ఛార్జి డాక్టర్ ఎ.కిరణ్ కుమార్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సంయుక్తంగా సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సాంకేతిక ఆధారిత విద్య, పరిశ్రమ సంబంధిత నైపుణ్య అభివృద్ధికి గీతం యొక్క నిబద్ధతలో ఈ కొత్త సౌకర్యం మరో ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…