– మూడు సెల్ ఫోన్లు,రెండు తులాల బంగారం,10 వేల నగదు స్వాధీనం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరి మహిళలే టార్గెట్ చేస్తూ దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు ముఠాను పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు, పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కిష్టారెడ్డిపేట, ఇంద్రేశం,రామేశ్వరం బండ శివారులో నివాసం ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా పారిశ్రామిక వాడలో ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూదారి దోపిడీలకు పాల్పడుతున్నారు. సోమవారం మండలంలోని ఇంద్రేశం వద్ద ఓ అర్ అర్ సర్వీస్ రోడ్ లో వాహనాలను తనిఖీలు చేస్తుండగా పోలీసులు చూసి పారిపోతున్న ఏర్పుల నర్సింలు,హరిజన నర్సింలు,నాందారి హన్మంతు, వడ్డే అంజమ్మ, విశ్లవత్ ఇందిర ,లక్ష్మి .దుర్గ, నిర్మలను పట్టుకొని తమ దైన శైలిలో విచారించగా ఒంటరి మహిళలే టార్గెట్ గా దోపిడీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, రెండు తులాల బంగారం,10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…