మనవార్తలు , పటాన్ చెరు:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు .
గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని కవయిత్రి బహినాబాయి చౌధరి ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో అరుణ్ పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పూనెలోని ప్రాంతీయ ఎన్ఎస్ఎస్ డెరైక్టరేట్ ఈ ముందస్తు శిబిరాన్ని నిర్వహించింది . అరుణ్ దినకరన్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడలతో పాటు ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు .
ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గణతంత్ర దినోత్సవ కవాతుకు గీతం విద్యార్థి ఎంపిక కావడం పట్ల రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తదితరులు హర్షం వెలిబుచ్చి , అరుణ్ను అభినందించారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…