politics

మహనీయులను స్మరించుకోండి… గీతం ఆతిథ్య ఉపన్యాసంలో హోమీ భాభా వీసీ ప్రొఫెసర్ వాసుదేవరావు సూచన

మనవార్తలు ,పటాన్ చెరు:

అరకొర సౌకర్యాలతోనే విస్తృత పరిశోధనలను గావించి , అద్భుత ఆవిష్కరణలు చేసి ప్రపంచ మానవాళి పురోభివృద్ధికి దోహదపడ్డ మహనీయులను సదా స్మరించుకోవాలని ముంబెలోని హోమీ భాభా జాతీయ సంస్థ ఉపకులపతి , కల్పక్కంలోని ఐజీసీఏఆర్ పూర్వ సంచాలకుడు ప్రొఫెసర్ పీ.ఆర్ . వాసుదేవరావు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ‘ శాస్త్రం – శాస్త్రవేత్తలు ‘ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు . ఆంటోనీ హెన్రీ బెక్వెరెల్ , మేరీ క్యూరీ , లిప్ మీట్నర్ , హోమీ జె . భాభా , సీవీ రామన్ వంటి మహనీయులు తమ తెలివితేటలు , పట్టుదలతో విశేషంగా పరిశోధించి మేటి ఆవిష్కరణలను గావించినట్టు ఆయన చెప్పారు .

అరకొర వసతులతోనే అహోరాత్రులు శ్రమించి ఆయా రంగాలలో రాణించిన వారంతా విభిన్న నేపథ్యల నుంచి వచ్చారన్నారు . వారిలో కొందరికి , తొలినాళ్ళలో తగిన ప్రోత్సాహం కూడా లేదని చెప్పారు . కానీ కృషి , పట్టుదల , నిబద్ధతలతో శ్రమించి విశ్వ మానవాళికి గొప్ప ఆవిష్కరణలను అందించారన్నారు . ఉన్నత విద్యలో మహిళలకు అనుమతి లేక క్యూరీ ఐదేళ్ళు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని , చివరకు ట్యూటర్ సహాయంతో వియన్నా విశ్వవిద్యాలయంలో సీటు సాధించి పోస్ట్ డాక్టరల్ వరకు రాణించినట్టు చెప్పారు . రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళాగా పేరొందినా , తొలుత ఆమె పేరు నోబెల్ కమిటీ పరిశీలకనే రాకపోవడం విశేషమన్నారు .

హోమీ భాభాకు విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎన్నో వచ్చినా , వాటిని తృణప్రాయంగా భావించి మనదేశంలో అణుశక్తి రంగానికి బీజం వేసి , ప్రపంచ దేశాల సరసన మనం తలెత్తుకుని నిలబడేలా చేసిన దార్శనికుడిగా ఆయన అభివర్ణించారు . జాతిపిత మహాత్మా గాంధీని ఉటంకిస్తూ ఐదు మహా పాపాలను ప్రొఫెసర్ వాసుదేవరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు . పనిలేని సంపద , మనస్సాక్షి లేని ఆనందం , పాత్రలేని జ్ఞానం , నెతికతలేని వాణిజ్యం , మానవత్వం లేని శాస్త్రం , త్యాగంలేని మతం , సూత్రాలు లేని రాజకీయాలు వ్యర్థమన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శరత్చంద్రబాబు అతిథిని పరిచయం చేశారు . భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రావూరి బాలాజీరావు స్వాగతోపన్యాసం చేయగా , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెస్ జి.శివకుమార్ వందన సమర్పణ చేశారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago