Hyderabad

క్యూర్ ఫుడ్స్‌ తో క‌లిసి “ఆరంభం” ప్రారంభిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌

* చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్‌

* ప్ర‌తి గింజ‌లో పోష‌క విలువ‌లు అపారం

* ఆహార రంగంలో ర‌కుల్ ప్రీత్ తొలి పెట్టుబ‌డి

మనవార్తలు ,హైదరాబాద్: 

టాలీవుడ్, బాలీవుడ్ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా త‌న సొంత డైన్-ఇన్ రెస్టారెంట్ “ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్”ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో మంగళవారం ఇది ప్రారంభమైంది. ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ప్రీత్, ఆరంభం కోసం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్” అనేది భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ ఫుడ్ అండ్ బెవ‌రేజెస్ సంస్థ‌, క్లౌడ్ కిచెన్ ఆప‌రేట‌ర్ క్యూర్ ఫుడ్స్‌ తో కొలాబరేషన్. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం కోసం ఎప్పుడూ నిబద్ధత చూపించే రకుల్ ప్రీత్, ఇప్పుడు ఆరంభంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, సమగ్ర ఆరోగ్యాన్ని అందరికీ అందించేందుకు సిద్ధమైంది. నేను హైద‌రాబాద్‌లో నా తొలి మిల్లెట్ ఆధారిత రెస్టారెంటును ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఫిట్ నెస్ ఔత్సాహికురాలిగా, మంచి రుచికరమైన పోషకమైన ఆహారాన్ని తినడానికి నేను ఎప్పుడూ మార్గాలను అన్వేషిస్తాను. హైదరాబాద్ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది, నేను నా నట జీవితాన్ని ఇక్కడే ప్రారంభించాను. నా ఎఫ్ అండ్ బి వెంచర్ కూడా ఇక్కడే ప్రారంభమవుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రత్యేకమైన, కాలానుగుణ మెనూ చిరుధాన్యాల ఆధారిత వంటకాలతోనే రూపొందింది. రుచిలో రాజీపడకుండా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తుంది” అని తెలిపింది.

ఈ రెస్టారెంటు ఒక విభిన్న‌మైన డైన్-ఇన్ కాన్సెప్ట్. ఇందులో పూర్తిగా చిరుధాన్యాల‌తో కూడిన వంట‌కాలే ఉంటాయి, ప్ర‌తి గింజ‌లోనూ పోష‌క విలువ‌లు ఉంటాయి. ఇది చిరుధాన్యాల కేంద్రీకృత మెనూతో అసమాన భోజన అనుభవాన్ని అందిస్తుంది. శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో అంతర్భాగంగా ఉన్న పురాతన ధాన్యాలనే ఇది అందరికీ అందజేస్తుంది. ఈ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా క్యూర్‌ఫుడ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు అంకిత్ నాగోరి మాట్లాడుతూ, “ఆరంభం అనేది కేవ‌లం ఒక రెస్టారెంటు మాత్ర‌మే కాదు; ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలికి మేం ఎలా క‌ట్టుబ‌డి ఉన్నామో, ఆహార నిర్ణ‌యాల‌పై ఎంత బాధ్య‌త‌గా ఉన్నామో అది చూపిస్తుంది. ఈ భాగ‌స్వామ్యం ప‌ట్ల మేమెంతో ఆనందిస్తున్నాం. త్వరలోనే బెంగళూరు, చెన్నైలో మరో రెండు రెస్టారెంట్లతో పాటు ఈ సంవత్సరం మరో పది క్లౌడ్ కిచెన్లు కూడా ప్రారంభిస్తాం” అని చెప్పారు.

‘అరంభం – స్టార్ట్స్ విత్ మిల్లెట్’ అనేది వంట‌కాల‌కు కాబోయే హాట్ స్పాట్. ఇక్కడ ఆహార ప్రియులు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనే లక్ష్యంతో వారి ఆహార సాహసాలను ఆహ్లాదకరమైన, స్థిరమైన విందుగా మార్చుకోవచ్చు. చిరుధాన్యాలు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా బాగుంటాయి. ఈ మిరాకిల్ ఫుడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రజల ఆహారంలో చాలా అవసరమైన పోషకాలను జోడించడానికి ప్రోత్సహిస్తోంది. కేంద్రప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి పోషక ప్రయోజనాలు, పర్యావరణ సుస్థిరతను చూపించడం ద్వారా పాకశాస్త్ర తీరుతెన్నులనే మార్చడానికి ‘అరంభం’ ప్రయత్నిస్తుంది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago