Telangana

జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు టి డబ్ల్యు జె ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

మనవార్తలు , రంగారెడ్డి జిల్లా :

రంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు మంజూరు, ఇతర సమస్యల పరిష్కారించాలని కోరుతూ సోమవారం రోజు కొంగర కలాన్ లోని. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు పొందేందుకు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారని, చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున తమరు ప్రభుత్వం నుంచి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “జర్నలిస్టుల డిమాండ్స్ డే” పాటిస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

డిమాండ్లు…

1 సుప్రీం కోర్టు తీర్పు మేరకు
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు ఇవ్వాలి.
2. చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు, అడ్వర్టైజ్మెంట్స్ పెంచాలి.
3. జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించాలి.
4. బస్ పాస్, రైల్వే పాస్ లపై 100 శాతం రాయితీ కల్పించాలి.
5. ఆర్టీసీ బస్ రాయితీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలి.
6. జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలి.
7. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
8. మహిళా జర్నలిస్టుల రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించాలి.
9. జర్నలిస్టులకు ”జర్నలిస్టుబంధు” పథకం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి సైదులు, శేరిలింగంపల్లి నుండి, నర్సింలు ముదిరాజ్, వరుణ్, సూర్య కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago