కార్మికులకు అండగా సిఐటియు ఎర్ర జెండా
పెన్నార్ కార్మికులు సీఐటీయూలోకి
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
సిఐటియు ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో కార్మికులు సిఐటియులో చేరుతున్నారని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో పెన్నార్ పరిశ్రమ కార్మికులు సీఐటీయూలోకి చేరడం జరిగినది. కార్మికులకు శాలువాలు కప్పి సిఐటియూ లోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ పెన్నార్ పరిశ్రమ కార్మికులు సిఐటీయూ లోకి పలుటపాలుగా చేరడం జరుగుతుందని, కార్మికులు నమ్ముకున్న ఎర్రజెండా కార్మికులకు అండగా ఎప్పుడు ఉంటుందన్నారు. సిఐటియు ద్వారానే కార్మికుల సంక్షేమ సాధ్యమని, కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. నిత్యము కార్మికులకు అండగా ఉంటూ పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. అనేక పరిశ్రమలలో అనేక విజయాలు సాధించిన చరిత్ర సిఐటియుకు ఉందని, మెరుగైన వేతన ఒప్పందాలు, సమస్యల పరిష్కారం వంటివి సిఐటియు సాధిస్తుందని తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.రాజ్ కుమార్, రామచందర్, సోమలింగం, రాజు, అంకారావు, రాథోడ్, బాబు, ధర్మారావు, నాయక్, రవీందర్ తదితర కార్మికులు చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య ,ప్రవీణ్ రెడ్డి, హరిహర తదితర కార్మికులు పాల్గొన్నారు.
