‘రెడ్‌మీ నోట్ 17 5జీ’ ఫోన్ లాంచ్ చేసిన సినీనటి హెబ్బా పటేల్

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ గురువారం భారత్‌లో ‘నోట్ 17 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా అమీర్ పేటలో సత్యా ఏజెన్సీస్ వాల్యూ జోన్ లో సినీనటి హెబ్బా పటేల్ విడుదల చేశారు. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8,000 mAh భారీ బ్యాటరీ, 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వంటి బలమైన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.27,999గా నిర్ణయించింది.

షావోమీ నిర్వహకులు సుదీప్ నల్లచెరువు మరియు శ్రీనివాస్ నల్లచెరువు మాట్లాడుతూ ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా ఉంది. ప్రారంభ ఆఫర్ కింద ఎస్‌బీఐ, యాక్సిస్, కొటక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.3,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

రెడ్‌మీ నోట్ 17 5జీలో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ట్రూకలర్ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3 (HyperOS 3) పై పనిచేస్తుంది. వినియోగదారుల కోసం కంపెనీ నాలుగేళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని స్పష్టం చేసింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఇందులో గరిష్ఠంగా 8GB RAM, 256GB స్టోరేజ్ అందుబాటులో ఉండగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో మెమరీని 2TB వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, హీటింగ్ తగ్గించేందుకు మెరుగైన కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు.

కెమెరా, భారీ బ్యాటరీ
ఫొటోగ్రఫీ విభాగంలో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ఒక సెకండరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 8,000 mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు రెండున్నర రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో లభిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యా ఏజెన్సీస్ నిర్వహకులు యూసఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *