politics

గీతం అధ్యాపకులకు ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులకు న్యూఢిల్లీలోని శాస్త్ర, సాంకేతిక పరిశోధనా బోర్డు (సెర్చ్) నుంచి రెండు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టెమ్ సెల్ లను లక్ష్యంగా చేసుకుని అధ్యయనం చేసే ప్రాజెక్టుకు రూ.65.06 లక్షలను మంజూరు చేసినట్టు తెలిపారు. స్కూల్ ఆఫ్ సైన్స్ లోని బయో కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ రామారావు మల్లా ప్రధాన పరిశోధకుడిగా (పీఐ), అదే విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ పి. కిరణ్మయి సహ పరిశోధకురాలిగా (కో-పీఐ)గా వ్యవహరిస్తారన్నారు. అయస్కాంత, అయిస్కాంతం కాని పదార్థాల కోసం విద్యుదయస్కాంత విధ్వంసం చేయని విధానాన్ని అభివృ ద్ధి చేయడం కోసం రూ.32.40 లక్షల నిధులను స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ అంగాని ప్రధాన పరిశోధకుడిగా, డాక్టర్ రవికుమార్ గురజాడ సహ పరిశోధకుడిగా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు ఆయన వివరించారు. వీటికి అదనంగా, జీవప్రేరణతో, దూరం నుంచి నీటి లోపల నడప గల వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం ఐఐటీ , హైదరాబాద్ రూ.10 లక్షల నిధులను కేటాయించినట్టు తెలిపారు. జార్ఖండ్ (జంషెడ్ పూర్ )లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ) చేపడుతున్న ఈ ప్రాజెక్టులో, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ ప్రపుల్ల కుమార్ స్వెన్ సహ ప రిశోధకుడిగా వ్యవహరిస్తారన్నారు.స్వీయ పరిశోధన, ప్రతిభలతో తాము చేపడుతున్న అధ్యయనానికి పరిశోధనా గ్రాంటులను జాతీయ సంస్థల నుంచి పొందిన గీతం అధ్యాపకులను ప్రొఫెసర్ దయానంద సిద్ధపెట్టం అభినందించారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago