Telangana

గీతంలో నేటి నుండి ప్రమాణ 2024 ఫెస్ట్

_గీతమ్ లో మొద‌లైన ప్రమాణ సందడి 

_ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్న సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైద‌రాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక పండుగ ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో విభిన్నమైన సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల మేలు కలయికగా సాగుతుందని, వేలాది మంది విద్యార్థులను ఈ ఫెస్ట్ ఆకర్షించడమే గాక వారిలోని ప్రతిభ, నైపుణ్యం, సాంస్కృతిక వినోదాన్ని ప్రదర్శించే వేదికగా ఉపకరిస్తుందన్నారు. ప్రమాణ-2024 ప్రచారంలో భాగంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ను నిర్వహించడంతో పాటు పలు కళాశాలలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్టు వారు వివరించారు. ఇప్పటికే పలు సాంకేతిక కార్యక్రమాలు, వ‌ర్క్ షాప్ లు నిర్వహించామ‌ని పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల ముఖ్య అతిథిగా, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గడ్డం వంశీకృష్ణ, ప్రారంభ వేడుకలలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, ప్రమాణ-2024ను లాంఛనంగా ఆరంభిస్తారని తెలిపారు. ఎన్ టీ టీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తారన్నారు. తొలి రోజు నిర్వహించే త్రీవరీ బ్యాండ్ కు కొనసాగింపుగా రెండో రోజు రామ్ మిర్యాల, సాహితీ చాగంటి తను పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించనున్నట్టు తెలియజేశారు. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, సంప్రదాయ నృత్యాలు, ర్యాంప్ వాక్, కార్నివాల్, ఆటో ఎక్స్ పో, విద్యార్థులతో స్కిట్లు, పలు ప్రదర్శనలతో పాటు మనదేశంలోనే పేరొందిన డీజే ప్రాజెక్టు 91, మధ్య స్కాట్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ డీజే నినా సూర్టే ఈ మూడు రోజుల ఫెస్ట్ లో ఆహూతుల జోష్ ను పెంచనున్నట్టు వారు వివరించారు.గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల చుట్టుపక్కల నుంచి, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ ఫెస్ట్ లో పాల్గొనడానికి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారని, దాదాపు ఇరవైవేల మంది పాల్గొననున్నట్టు స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు తెలియజేశారు.

 

 

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago