Telangana

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం

స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతి

నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం

మనవార్తలు ప్రతినిధి ,సంగారెడ్డి :

ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన  పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూపచ్చటి పొలాలు మూడు పంటలు పండే భూములు స్వచ్ఛమైన గాలి అందమైన తమ పల్లెల పరిధిలో అభివృద్ధి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు అయితే తమ గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్న కొంగత్త ఆశలతో   పటాన్‌చెరు  నియోజకవర్గ ప్రజలు 70వ దశకంలో పరిశ్రమల ఏర్పాటునకు స్వాగతం పలికారు అన్నారు.

పటాన్‌చెరు   నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశమైలారం,  పటాన్‌చెరు , జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల, అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండి గూడెం, దయరా గ్రామాల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా బల్క్ డ్రగ్స్ పరిశ్రమలతో పాటు కెమికల్స్, మెడిసిన్స్, పెస్టిసైడ్స్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

పటాన్‌చెరు   నియోజకవర్గ కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు సైతం జస్టిస్ మిగతా కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నివేదిక తప్పించుకుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ సైతం స్వయంగా నియోజకవర్గంలో పర్యటించి కాలుష్య పరిస్థితులను తెలుసుకున్నారని పేర్కొన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2016లో చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ కాలుష్య నివారణ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.కాలుష్యం మూలంగా వ్యాధులకు గురవుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తో పాటు ఇస్నాపూర్ పెద్ద చెరువు, గండిగూడెం, ఆసాని కుంట, కిష్టారెడ్డిపేట చెరువుల పరిధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ సైతం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

నియోజకవర్గ పరిధిలోని బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు ప్రతి సంవత్సరం తమ లాభాల్లో 0.5 శాతం డబ్బులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక అకౌంట్లో జమ చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణకు ఆదేశాలు సైతం జారీ చేసిందన్నారు.2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలు అందిస్తున్న సి.ఎస్.ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని వివరించారు.నీళ్లు నిధులు నియామకాలు అన్న అంశంతో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక నిధులు స్థానికంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు .

ప్రతి రోజు కాలుష్య జలాలు విష వాయువులతో జీవనం కొనసాగిస్తున్న పటాన్‌చెరు  నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు అందిస్తున్న సిఎస్ ఆర్ నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాము. గత రెండున్నర సంవత్సరాలుగా సి ఎస్ ఆర్ నిధులు లేకపోవడం మూలంగా అభివృద్ధి కుంటూ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పటాన్చెరు నియోజకవర్గం నుండి చెల్లిస్తున్న సి ఎస్ ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు పెట్టాలని.. లేని పక్షంలో ప్రజల నిరసనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

2 hours ago

నాగార్జున ఉన్నత పాఠశాలలో మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచిత టైలరింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…

3 hours ago

ఘనంగా హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…

3 hours ago

కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు

– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్‌ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…

3 hours ago

న్యూలాండ్ లేబొరేటరీస్‌లో జాతీయ భద్రతా వారోత్సవాల వేడుకలు

భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…

3 hours ago

గణితశాస్త్రంలో పప్పుల అశోక్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి…

8 hours ago