మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి పప్పుల అశోక్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ నమూనాలను ఉపయోగించి క్రిప్టోకరెన్సీ ధర అంచనా: ఒక సమగ్ర తులనాత్మక కాల శ్రేణి విశ్లేషణ’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణాంక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ డాక్టరల్ పరిశోధన, బిట్ కాయిన్ (బీటీసీ), ఎథేరియం (ఈటీహెచ్), బైనాన్స్ కాయిన్ (బీఎన్ బీ) వంటి అత్యంత అస్థిరమైన డిజిటల్ ఆస్తులను అంచనా వేయడానికి అధునాతన పద్ధతులను అన్వేషించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం సాంప్రదాయ గణాంక నమూనాలు, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ లు, డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్లను మూల్యాంకనం చేస్తుందని, అంచనా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి హైబ్రిడ్ మోటల్స్ ను పరిచయం చేస్తుందని వెల్లడించారు.
ఈ పరిశోధన ఫలితాల ప్రకారం, హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ మోడల్స్- ముఖ్యంగా BiLSTM-GRU ఫ్రేమ్ వర్కు-ప్రధాన పనితీరు కొలమానాలన్నింటిలో సాంప్రదాయ, స్టాండ్ అలోన్ మోడల్స్ ను గణనీయంగా అధిగమించి, క్రిప్టోకరెన్సీ ధర అంచనాలో మెరుగైన ఖచ్చితత్వం, పటిష్టతను అందిస్తున్నాయని స్పష్టమవుతోందన్నారు.ఈ పరిశోధన, ఆర్థిక అంచనాలలో హైబ్రిడ్ ఏఐ నమూనాల పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, పెట్టుబడిదారులకు, విశ్లేషకులకు, విస్తృత ఫిన్ టెక్ పర్యావరణ వ్యవస్థకు విలువైన అంతర్దృష్టులను అందిస్తుందని తెలిపారు.
డాక్టర్ అశోక్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…