Telangana

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతితో మమేకమై, పూలను పూజిస్తూ, సమూహంగా బతుకమ్మ ఆడటం తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు, నృత్యాల ద్వారా తమ సంస్కృతిని తరతరాలకు అందిస్తున్నారని తెలిపారు.శ్రమ సంస్కృతికి, మహిళల ఐక్యతకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని ఆయన అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళలను గౌరవిస్తూ, వారి హక్కులను కాపాడుతూ, లింగ సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు, శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

12 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

16 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

18 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

18 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago

చందానగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పీజేఆర్ స్టేడియంలో ఘనంగా పూల పండుగ వేడుకలు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా…

1 day ago