Telangana

హైదరాబాద్‌లో ‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’

క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో ఆగస్టు 21, 22

భారతీయ చేనేతలు, సంప్రదాయ కళలు, హస్తకళల ప్రదర్శన

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’ హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని  హాజరుకానున్నారు.ఆగస్టు 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో ఈ రెండు రోజుల ప్రదర్శన జరగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.మన హస్తకళలు తరతరాల జ్ఞానం, కథలు, సాంస్కృతిక వారసత్వాన్ని మోసుకొస్తున్నాయి. ఈ సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు కళాకారులకు మద్దతు అందించే వేదికగా పింక్ గులాబ్ నిలవడం అభినందనీయం.

26 ఏళ్ల విద్యారంగ ప్రస్థానం అనంతరం కొత్త ప్రయాణం

‘పింక్ గులాబ్’ను మోహువా ఛటర్జీ స్థాపించి, క్యూరేట్ చేస్తున్నారు. చేనేతలు, వస్త్రాలు, భారతీయ హస్తకళలపై తనకున్న అభిరుచితో ఆమె ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. భారతీయ సంప్రదాయ కళలను కేవలం భద్రపరచడం కాకుండావాటిని నేటి జీవనశైలిలో భాగం చేసి, ధరించి, ఆస్వాదించేలా చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు.దేశవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర డిజైనర్లు, నేత కార్మికులు, కళాకారులు, స్వదేశీ బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి ప్రత్యేకత, నైపుణ్యం, కళా సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

“మన వారసత్వానికి సమకాలీన రూపాన్ని అందించే వేదికగా పింక్ గులాబ్‌ను తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం. ప్రతి నేత, ప్రతి కుట్టు, ప్రతి చేతితో తయారైన వస్తువు వెనుక ఒక కళాకారుడి ప్రతిభ, ఒక సంప్రదాయం ఉంటుంది. ముఖ్యంగా ప్రామాణికత, అర్థవంతమైన డిజైన్‌ను కోరుకునే నేటి తరం ప్రజలకు ఈ కథలను చేరువ చేయాలనేదే నా లక్ష్యం” అని *పింక్ గులాబ్ వ్యవస్థాపకురాలు, క్యూరేటర్ మోహువా ఛటర్జీ తెలిపారు.

సంప్రదాయ కళలు, చేనేతలను సంరక్షిస్తున్న కళాకారులు, వారి కుటుంబాలు, స్థానిక సమాజాలకు ప్రోత్సాహం అందించడంతో పాటు, చేతితో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించడం ద్వారా సుస్థిరమైన అవకాశాలను అందించడమే పింక్ గులాబ్ లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘ది హెరిటేజ్ ఎడిట్’ ద్వారా భారతీయ కళలు, చేనేతలు, హస్తకళల వైవిధ్యాన్ని నగరవాసులకు పరిచయం చేయడంతో పాటు, సంప్రదాయాన్ని ఆధునిక డిజైన్‌తో మేళవించే ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago