మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆదర్శ తపాలా కార్యాలయంగా ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం మరియు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి, సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.ఈ సందర్బంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ సంయుక్తంగా మాట్లాడుతూ సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్‌పై గతంలో ప్రజలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కి, ఈ అంశంపై చొరవ తీసుకున్న మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాధవనేని కి యువజన సంఘాల సమితి తరఫున మెట్టుశ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటైతే జిల్లాలోని విద్యార్థులు, విదేశాలకు వెళ్లే యువత, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే పాస్‌పోర్ట్ సేవలు పొందే అవకాశం కలుగుతుందని మెట్టు శ్రీధర్ అన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…