Telangana

గీతంలో ఘనంగా ఫార్మకాలజీ దినోత్సవం

అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేసిన ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్పీ), ‘మెరుగైన ఆరోగ్యం కోసం ఔషధ ఆష్కరణను ప్రోత్సహించడం’ అనే ఇతివృత్తంతో రెండవ జాతీయ ఫార్మకాలజీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. భారతీయ ఫార్మకాలజీ వ్యవస్థాపకుడైన కల్నల్ ఆర్.ఎన్.చోప్రాను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం, ఔషధ ఆవిష్కరణను ముందుకు తీసుకెళ్లడంలో, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో ఫార్మకాలజీ పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా చాటింది.

హైదరాబాదులోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి శ్రీనివాసన్ ముఖ్య అతిథిగా హాజరై, ఈ-అబ్ స్ట్రాక్ట్ పుస్తకాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ‘ఔషధ ఆవిష్కణలో ప్రీక్లినికల్ ఫార్మకాలజీ: అంతర్దృష్టులు, సవాళ్లు, పురోగతులు, అవకాశాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ, ఔషధ ఆవిష్కణ, ప్రీక్లినికల్ నమూనాలు సమర్థత, భద్రత, ఎక్స్ పోజర్, అభివృద్ధి చెందుతున్న విధానాలు, పరిశోధనను సమర్థవంతమైన మందులుగా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. వర్ధమాన ఫార్మసిస్టులు నూతన ఆవిష్కరణలను స్వీకరించాలని, శ్రేష్ఠతను సాధించాలని, ఫార్మాస్యూటికల్ పరిశోధన, ఆరోగ్య సంరక్షణకు అర్థవంతంగా దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫార్మకాలజిస్టుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, మెరుగైన ఆధారాలు, మెరుగైన నిర్ణయాలు, వేగవంతమైన అనువాదం, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించడమే అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. ‘ఔషధ ఆవిష్కరణను మెరుగైన ఆరోగ్యం కోసం ఆధారాలుగా మార్చే వారధియే ప్రీక్లినికల్ ఫార్మకాలజీ’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ వేడుకలలో భాగంగా, ఫార్మకాలజీ, ఔషధ ఆవిష్కరణకు సంబంధించిన అంశాలపై ఒక ఈ-పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పరిశోధకులు చురుకుగా పాల్గొని తమ జ్జానాన్ని, సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ పోటీ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన 120కి పైగా ఈ-పోస్టర్లను పరిశీలించి, వాటిలో మూడు అత్యుత్తమైన వాటిగా ఎంపిక చేసి, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతు లతో పాటు జ్జాపికలు, ఐదు వేలు, మూడు వేలు, రెండు వేల రూపాయల నగదు పురస్కారాలను అందజేశారు.

ఈ కార్యక్రమం, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు తదితరులు ప్రముఖ నిపుణులతో సంభాషించడానికి, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ పరిశోధనలలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలు, సవాళ్లపై అవగాహన పొందడానికి ఒక ఆసక్తికరమైన వేదికను అందించింది.బీ.ఫార్మసీ చివరి ఏడాది విద్యార్థిని రిధిమ స్వాగత నృత్యంతో కార్యక్రమం ప్రారంభం కాగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సోనియా రాణి స్వాగతోపన్యాసం చేశారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్, కార్యక్రమ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ జి.శివకుమార్, అతిథిని సత్కరించి, వందన సమర్పణ చేశారు.శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో, మెరుగైన ఆరోగ్య ఫలితాల కోసం సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఫార్మకాలజీ ప్రాముఖ్యతను ఈ వేడుక పునరుద్ఘాటించింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago