Telangana

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) పరిశోధక విద్యార్థిని కల్లకుంట సునీల డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సెంట్రాలిటీ కొలతలపై దృష్టి సారించి, గ్రాఫ్ థియరీ టెక్నిక్ లను ఉపయోగించి కీలక నోడ్ గుర్తింపు ద్వారా వైర్ లెస్ సెన్సార్ నెట్ వర్కుల ఆప్టిమైజేషన్’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఈఈసీఈ విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఎ.శ్రీనివాస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ అంతర్ విభాగ పరిశోధన, వైర్ లెస్ సెన్సార్ నెట్ వర్కుల శక్తి సామర్థ్యం, విశ్వసనీయత, స్థితిస్థాపకత, డేటా ప్రసార సామర్థ్యాలను మెరుగుపరచడానికి గ్రాఫ్ థియరీ, గణాంకాలు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లను ఏకీకృతం చేస్తుందని వివరించారు. ఈ పరిశోధనకు పర్యావరణ పర్యవేక్షణ, ప్రెసిషన్ అగ్రికల్చర్, పారిశ్రామిక ఆటో మేషన్, ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ నిఘా వంటి రంగాలలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయన్నారు.తన డాక్టరేట్ ప్రస్థానంలో, డాక్టర్ సునీల పది పరిశోధనా పత్రాలను ప్రచురించడమే గాక, ఐఐటీ హైదరాబాదు, బిట్స్ పిలానీ, హైదరాబాదు ప్రాంగణాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులలో తన పరిశోధనను సమర్పించారు.డాక్టర్ సునీల సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం నాయకత్వంతో పాటు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పరిశోధన, వృత్తిపరమైన ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని వారు ఆకాంక్షించినట్టు తెలిపారు.

admin

Recent Posts

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…

49 minutes ago

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

1 hour ago

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

22 hours ago

మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…

22 hours ago

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి  నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…

23 hours ago

యుక్తితో, నేర్పుగా వ్యవహరించాలి

ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…

23 hours ago