అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు
అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము
ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ :
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అమీన్పూర్ లో ఏర్పాటు చేయదలచిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి ) ను తరలించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని.. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని 993 సర్వే నంబర్లో ఎస్ టి పి ఏర్పాటు చేయనున్న స్థలంలో శనివారం ఆయా కాలనీల ప్రజలతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ పరిధిలోని మురుగు నీటి జలాలను శుద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా తమకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానిక కాలనీల ప్రజల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు తలెత్తుతున్న నేపథ్యంలో మెజార్టీ ప్రజలు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి అనుగుణంగా ఎస్టిపిని తరలించడం లేదా రద్దు చేసేందుకు ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు.
అవసరమైన పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమీన్పూర్ లో ఎస్టీపీని ఏర్పాటు చేయడం జరగదని స్పష్టం చేశారు. అత్యంత అవసరమైతే ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేసి నక్కవాగులోకి తరలించడం జరుగుతుందని తెలిపారు. పనులను వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ప్లాంట్ ఏర్పాటుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, జలమండలి సిజిఎం పద్మజ, జిఎం సుబ్బారాయుడు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…