కెసిఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు , అమీన్పూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పూర్తి నిరాదరణకు గురైన గ్రామ పంచాయతీలు నేడు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ట్రాక్టరు, ట్యాంకర్, ప్రతినెల నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకునీ వెళుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలతో పాటు, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు తొలగించి ఆధునిక హంగులతో భవనాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతామని అన్నారు.
గ్రామస్థాయిలో సర్పంచులు ప్రతిరోజు ఉదయం గ్రామంలో పర్యటించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నప్పుడే సమస్యలు తెలుస్తాయని, ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 67 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నీతిశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…