మాట ఇచ్చారు ఐదు లక్షలు అందించారు
పటాన్‌చెరు సత్యసాయి సేవా సమితికి అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీ సత్య సాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధికి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని.. నవంబర్లో జరగనున్న సత్య సాయిబాబా గురుపూర్ణిమ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గము నుండి 3000 మంది భక్తులు తరలి వెళ్తున్నారని ఇందుకోసం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్‌చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల సత్య సాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ పురస్కరించుకొని వంద రోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే జీఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అట్టడగు వర్గాల అభివృద్ధికి సత్య సాయి బాబా చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయని తెలిపారు. పటాన్‌చెరులో సత్యసాయి బాబా మందిరం నిర్మాణానికి సైతం గతంలో తాను సంపూర్ణ సహకారం అందించినట్టు గుర్తు చేశారు. సత్య సాయి బాబా సేవ సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనూ గతంలో ప్రజలకు ప్రత్యేక నీటి ట్యాంకులు నిర్మించి మంచినీటిని అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సత్య సాయిబాబా మందిరాలు నిర్మాణాలకు భూమిని సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సత్యసాయి బాబా సేవాసమితి బాధ్యులు రామి రెడ్డి, వెంకటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…