ఎస్ఐఆర్ లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం స్థానికంగానే ఓటరు నమోదు చేయించుకోండి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
మినీ ఇండియగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతర రాష్ట్రాల ఓటర్లు స్థానికంగానే తమ ఓటు వివరాలను నమోదు చేసుకుని పటాన్‌చెరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రాజస్థాన్, గుజరాత్, శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలతోపాటు, వివిధ రంగాల వ్యాపారస్తులతో ఎస్ ఐ ఆర్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 25 సంవత్సరాల తర్వాత ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతోందాన్ని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్థానికంగా నివాసమే ఏర్పాటు చేసుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని వారందరూ విధిగా స్థానికంగానే ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మినీ ఇండియా గా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రజలందరినీ సొంత బిడ్డల వలె చూసుకుంటున్నామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉందని వివరాలు నమోదు చేయించుకొని వారందరూ తప్పనిసరిగా వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, విజయ్ కుమార్, బిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేష్, దామోదర్ రెడ్డి, తేజ, రాజు, రామ్మోహన్, వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…