మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్‌చెరు పట్టణంలో ఆగస్టు 10వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై బుధవారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీన నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, పురోహితులు, ప్రజలు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…