Telangana

రూ.13 కోట్లతో 172 నూతన దుకాణాల నిర్మాణం వేగవంతం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం తెలిపారు.గురువారం పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏపూరి శివానందం మాట్లాడుతూప్రస్తుతం 13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.మార్కెట్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

2 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

20 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

20 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago