-ప్రచార షెడ్యూల్ విడుదల చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
-కెసిఆర్ నాయకత్వంలో మెదక్ లో హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తాం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచార షెడ్యూలు ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు.సోమవారం పటాన్చెరులో నియోజకవర్గ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, డివిజన్లు, మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు.రాబోయే నెల రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ నెల 10వ తేదీన పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ రెడ్డి దేవాలయం ఆవరణలో ప్రచార రథాలకు వాహన పూజలు ప్రారంభించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల, మున్సిపల్, డివిజన్లో స్థాయిలో ప్రస్తుతం స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గం నుండి వెంకట్రామ్ రెడ్డికి భారీ మెజారిటీ అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…