నేటి నుండి పటాన్ చెరులో 44వ తెలంగాణ అండర్ 14 కోకో బాలబాలికల అంతర్ జిల్లాల ఛాంపియన్షిప్
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర స్థాయి క్రీడలకు పటాన్ చెరు పట్టణం మరోసారి వేదికగా నిలవనుంది. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మాదానం వేదికగా నేటి నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు 44వ తెలంగాణ అండర్ 14 ఖో ఖో బాల–బాలికల అంతర్ జిల్లాల చాంపియన్షిప్–2025 పోటీలు జరగనున్నాయి. పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఖో ఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రీడ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మైత్రి మైదానంలో క్రీడల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 33 జిల్లాల నుండి తరలివచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయంతో పాటు అల్పాహారం, భోజనం సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఏడాది పొడుపున వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ పోటీలకు పటాన్ చెరు మైత్రి మైదానాని వేదికగా నిలుపుతున్నామని తెలిపారు. కోకో క్రీడకు మరింత ప్రాచుర్యం అందించేలా రాష్ట్రస్థాయి పోటీలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరి కిషన్, కార్యదర్శి శ్రీకాంత్, పటాన్ చెరు సిఐ వినాయక రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…