ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,అమీన్పూర్: అమీన్పూర్ మండలం పటేల్ గూడ డ గ్రామ పరిధిలోని బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీలో స్థానిక మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక […]

Continue Reading

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి.. బంగారు భవితకు బాటలు వేసుకోండి

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు […]

Continue Reading

తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి,రచయిత మోటూరి నారాయణరావు

మనవార్తలు ,హైదరాబాద్: ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు లో పుట్టి హైదరాబాద్ శేరిలింగంపల్లి లో నివాసం ఉంటున్న కవి మోటూరి నారాయణరావు ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద  మోటూరి నారాయణరావు తమ కవితను […]

Continue Reading

క్యాన్సర్ చికిత్సకు హెబ్రీడ్ మెటీరియల్ కనుగొన్న సందీప్ కు డాక్టరేట్

మనవార్తలు ,పటాన్ చెరు: క్యాన్సర్ చికిత్స కోసం కొత్త హెబ్రీడ్ నానోమెటీరియల్ను అభివృద్ధి చేసి , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి రామస్వామి సందీప్ పేరాలను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు […]

Continue Reading

బొల్లారం మున్సిపల్లో పోషన్ అభియాన్ కార్యక్రమం

మనవార్తలు ,బొల్లారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా నేషనల్ పార్టీ,రాష్ట్ర పార్టీ మరియుజిల్లా పార్టీ ఆదేశాల మేరకు పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కేజెఆర్ ఆనంద్ క్రీష్ణారెడ్డి చేతుల మీదుగా ఆశా, అంగన్వాడీ వర్కర్లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే.సరస్వతి,సీనియర్ నాయకులు టీ. […]

Continue Reading

పోలీసు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

_వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ _ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్ కు పేరు తీసుకుని రండి మనవార్తలు ,పటాన్ చెరు: వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని జి ఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో సంగారెడ్డి జిల్లా పోలీసుల అధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు […]

Continue Reading

రామప్ప అందాలు చూసి తీరాల్సిందే : ప్రొఫెసర్ కేపీరావు

– గీతమ్ ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం _ ఆకట్టుకున్న ఫోటో ప్రదర్శన మనవార్తలు ,పటాన్ చెరు: ఇసుకపై ( శాండ్ బాక్స్ పద్ధతిలో నిర్మించిన రామప్ప దేవాలయ శిల్ప కళా వైభవాన్ని స్వయంగా చూసి తరించాల్సిందేనని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కేపీ రావు అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎహెచ్ఎస్ ) , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ‘ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని […]

Continue Reading

కన్నుల పండువగా ఈస్టర్ వేడుకలు

మనవార్తలు ,పటాన్ చెరు: దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు  మండలం అశోకనగర్ వేడుక హాల్లోనూ ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయా క్రైస్తవ దేవాలయాలలో పునరుత్థానుడైన ఏసుక్రీస్తు గూర్చి భక్తి గీతాలు ఆలపించగా, బోధకులు శుభ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపాలను సిలువ మీద మోసి మరణించి,తిరిగి లేచి […]

Continue Reading

రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: మానవాళికి ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, ఎవరు తమ మతాన్ని ప్రేమించడం తో పాటు ఇతరుల మతాన్ని గౌరవించాలని కోరారు. మానవ […]

Continue Reading

వైభవంగా రుద్రారం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ,హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు, శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం లో నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో 54 అడుగుల వీరా ఆంజనేయస్వామి ఆలయంలో దగ్గర జెండా […]

Continue Reading