politics

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పై యాజమాన్య వికాస కార్యక్రమం

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్బీ ) హెదరాబాద్ ఆధ్వర్యంలో 26-27 మే 2022 న ‘ ఎమోషనల్ ఇంటెలిజెన్స్’పై రెండు రోజుల ఇ – మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ యాజమాన్య వికాస కార్యక్రమంలో పాల్గొనే వారికి వ్యక్తిగత , వ్యక్తుల మధ్య ప్రభావానికి దారితీసే నెపుణ్యాలను అభివృద్ధికి దోహదపడుతుందన్నారు . పని ప్రదేశంలో భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం , స్వీయ సంబంధాలను అర్థం చేసుకునే మార్గాలను తెలుసుకోవడం , సమర్థమైన నిర్వహణను అలవరచుకోవడం , సామాజిక అవగాహనను పెంపొందించుకోవడం , నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ కార్యక్రమ లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు .

ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న జూనియర్ , సీనియర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఉద్దేశించినట్టు డాక్టర్ కరుణాకర్ తెలిపారు . ఇందులో పాల్గొనే వారందరికీ ఇ – సర్టిఫికెట్ జారీచేస్తామన్నారు . పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున ముందొచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు . ఆసక్తి గల అభ్యర్థులు ( https://forms.gle/ X64fYE11erCdeeth8 ) లింక్ ద్వారా దరఖాస్తును పూరించడం తప్పనిసరన్నారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ కె.ఎన్ . రేఖ , అసిస్టెంట్ ప్రొఫెసర్ , 91600 93544 ను సంప్రదించాలని లేదా rkrishna3@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని జీఎస్బీ డెరైక్టర్ సూచించారు

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago