Telangana

కళాకారులను సన్మానించే సంస్కృతి మాది.. కళాకారులపై దాడి చేసే విష సంస్కృతి మీది..

_గురువింద గింజ నీతులు.. దయ్యాల మారి వేదాలు..

_సొంత అన్ననే మోసం చేసిన మహోన్నత చరిత్ర మీది..

_మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే జిఎంఆర్ ఫైర్..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిరాధారణ ఆరోపణలు చేస్తూ రాజకీయాల్లో విలువలను మంటగలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కు ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారడం లేదని, వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ నుండి నందీశ్వర్ గౌడ్ కి టికెట్ కేటాయిస్తే మరోసారి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ 1987 సంవత్సరములో ఎలాంటి గుర్తింపు లేకున్నా దివంగత మాజీ మంత్రి పి. రామచంద్ర రెడ్డి పుణ్యంతో ఎంపీపీగా ఎన్నికయ్యావన్న విషయం మరిచితివా.నీ ఆఫీసును నీవే తగలపెట్టించుకుని, నక్సలైట్ల దాడి జరిగిందని, నక్సలైట్ల హిట్ లిస్టులో వున్నానని నాటకాలాడి గన్ మెన్లను పెట్టుకున్నావుఆరిస్ట్రో పరిశ్రమలో నీ యూనియస్ రాజకీయాలకు అడ్డు వస్తున్నాడని ఒక వర్కర్ ను పాటి గ్రామం జొన్న చేనులో చంపి సాక్ష్యాలను తారుమారు చేసి, తప్పించుకున్న చరిత్ర అందరికి తెలిసిందే బస్టాండ్ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తానని, పరిశ్రమలలో చందాలు వసూలు చేసి విగ్రహం పెట్టకుండా చందాలు జేబులో వేసుకొన్న చరిత్ర నీది

వారానికి ఒక రోజు పటాన్ చెరు లోని సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ లో ల్ మామూళ్ల కొరకు నీవు పెట్టె ఇబ్బంది తట్టుకోలేక ఆఫీస్ ఎత్తివేశారు గతములో ఉ‌న్న టోల్గేట్ ప్రోగ్రెసివ్ వారి నుండి దౌర్జన్యంగా నెల నెల వసూలు చేసిన మామూళ్లను ఎవ్వరు మర్చిపోరు.బిగ్ బాస్ షో ఆర్టిస్ట్ పై నీ కొడుకు ఆశిష్ గౌడ్ తాగిన మత్తులో దాడి చేస్తే, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్కైన విషయం గుర్తు లేదాకళాకారులను సన్మానించి సత్కరించే సంస్కృతి మాదైతే.. కళాకారులపై దాడి చేసే నీచ సంస్కృతి మీది మీ పిల్లలది ,గౌడ సంఘం సభ్యులకు చెందాల్సిన డబ్బులను ఏవిదంగా నొక్కేస్తున్నావో అందరికి తెలుసు

నువ్ MLA గా వున్నప్పుడు మార్వాడిల దగ్గర నెల నెల మామ్మూళ్లు వసూలు చేసిన విషయం జనం మర్చిపోలేరు.గుడిని గుడిలో లింగాన్ని మింగే పెద్దమనిషి శివరాత్రి జాగరణపై మాట్లాడడం విడ్డూరంనందన్న పటాన్ చెరులో బొడ్రాయి ఎక్కడుందో చెప్పండి..రేపు పొద్దున 7 గంటలకు బొడ్రాయి చూపిస్తే నేను తప్పుకుంటా రేషన్ డీలర్ల నుంచి, ఎక్సైజ్ నుంచి మామూళ్లు వసూలు చేసిన ఘనత నందీశ్వర్ ది నీ హయాంలో బస్టాండు, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏ మేరకు వసూలు చేశావు అందరికీ తెలిసిందే.

నేను రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తిని సంపాదించాను అంటూ ఆరోపణలు చేస్తున్నావు కదా.. ఆధారాలతో నిరూపిస్తే ఉన్న ఊరును, ఇంటిని వదిలేసి వెళ్తా అందుకు నువ్వు రెడీనా ,మా నాన్న 200 ఎకరాలు సంపాదిస్తే.. 100 ఎకరాలు ఎన్నికల్లో పోటీ చేసి అమ్ముకున్నామని తెలిపారు.ప్రజా జీవితంలో ప్రజలు ఆశీర్వదించినంత కాలం.. ఎంతటి ఆస్తినైనా అమ్ముకునేందుకు సిద్ధమే తప్ప మీ లాగా నక్క వినయాలు ప్రదర్శిస్తూ ప్రజలను మభ్య పెట్టడం మాకు మా కుటుంబానికి మా కార్యకర్తలకు చేతకాదు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు కాకముందే కంటోన్మెంట్ ఎన్నికల్లో బిజెపి సత్తా చూపుతుందంటూ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు.ముందస్తు ఎన్నికల నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరే స్థాయి నీకు లేదన్నారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. వచ్చే ఎన్నికల్లో నందీశ్వర్ కే టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ ను బ్రతిమిలాడుతా అవసరమైతే టిఆర్ఎస్ పార్టీ నుండి సామాన్య కార్యకర్తను నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపించుకుంటా.

దేవాలయాల్లో ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తే.. పటాన్చెరులో మాత్రం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరను ఐదేళ్లకోసారి ఎన్నికల సమయంలో మాత్రమే నిర్వహించే గొప్ప నాయకుడు నందీశ్వర్ గౌడ్.వాస్తవాలు తెలుసుకోకుండా.. నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకొని.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు.నాకన్నా వయసులో మూడు సంవత్సరాల పెద్దవాడైన నందీశ్వర్ గౌడ్ ను నేను ఎక్కడైనా ఎప్పుడైనా అన్నా అని మాత్రమే సంబోధిస్తానే తప్ప.. వాడు వీడు అంటూ సభ్యత లేకుండా సంస్కారం మరచి మాట్లాడే వ్యక్తిత్వం తమది కాదు నా చిన్న కుమారుడి వయస్సు కలిగిన నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనకు సెన్సు లేదంటూ వ్యాఖ్యానించడం వారి పెంపకానికి అద్దం పడుతోందన్నారు.

పటాన్చెరులోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయం నిర్మించిన అల్లాని వంశస్థులు, దేవాలయ ఖర్చులు పూజారుల జీతభత్యాల కోసం ఏడు ఎకరాల 27 గంటల భూమి కేటాయించగా, ప్రస్తుతం పూర్తి భూమి దేవాలయం రక్షణలో ఉందని దేవాలయ ప్రధాన పూజారి నరసింహచారి, ధర్మకర్త అల్లాని శ్రీనివాస్, గుడి అధ్యక్షులు మనోహర్ రెడ్డి లు తెలిపారు.ఇందులో కొంత భూభాగంలో ప్రైవేటు గృహ నిర్మాణ సంస్థ అద్దె ప్రతిపాదికన రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు అందిస్తుందని తెలిపారు. రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసిన గృహ నిర్మాణ సంస్థ ఎండి సంజీవరెడ్డి ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో ధ్రువీకరించారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాయని, హ్యాట్రిక్ విజయం అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago