Telangana

ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే మా లక్ష్యం

సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో సమీకృత భవనం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఉదయం పటాన్‌చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడి భాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటిని ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోని ప్రభుత్వ విభాగాలన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన ఆధునిక వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందించిన ఆదిత్రి యాజమాన్యం నాగేశ్వరరావు, సురేష్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, ఆదిత్రి కన్స్ట్రక్షన్స్ ఎండి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బండి శంకర్, పరమేష్ యాదవ్, అధికారులు భీం, సురేష్, శ్రీనివాస్, యాదగిరి, రంగారావు, జయరాం నాయక్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago