మనవార్తలు ,పటాన్ చెరు:
పల్లెలను పచ్చగా స్వేచ్ఛగా తీర్చిద్దిలనే తెలంగాణ లక్ష్యమని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు గ్రామాల అభివృద్ధ్ది కోసమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లే ప్రగతి కార్యకమాన్ని చేపడుతున్నట్లు నీలం మధు తెలిపారు చిట్కుల్ గ్రామ పరిధిలో పల్లె ప్రగతి లో భాగంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్ క్రీడా మైదానా లను ఎంపీపీ సుష్మ శ్రీ, జెడ్పీటీసీ సుప్రజ, ఎంపీడీవో బన్సీలాల్ లతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగిందని ప్రతి గ్రామంలో ఆసరా పెన్షన్ ,కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో ప్రజలకు ఆసరాగా నిలిచారని తెలిపారు.
మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటివి పథకాలతో చెరువుల అభివృద్ధి చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించారని అలాగే పరిశ్రమలకు వ్యవసాయానికి సైతం 24 గంటల కరెంటు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.రాజకీయాలకు అతీతంగా పూర్తిపారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఏకైక ప్రభుత్వం టీఆరెఎస్ అని అన్నారు .ఈ కార్యక్రమంలోఎంపీడీఓ బన్సీలాల్, ఎంపిఒ హరి శంకర్, ఇఓ కవిత, వార్డు సభ్యులు కృష్ణ,వెంకటేష్, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, డ్వాక్రా గ్రూప్ మహిళలు,ఎన్ఎమ్అర్ యువసేన పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…