Telangana

గీతంలో జాతీయ టెక్ ఫెస్ట్ హవానా ప్రారంభం

సాంకేతిక ప్రతిభను ప్రదర్శిస్తున్న ఔత్సాహికులు, ఉత్తేజకరమైన సవాళ్లతో పోటీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ హవానా-2025 గురువారం హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక నైపుణ్యం అనుభూతులతో స్ఫూర్తిని రగిల్చే ఈ కార్యక్రమాన్ని ఈఈసీఈ విభాగానికి చెందిన జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహిస్తోంది. అత్యాధునిక ఆవిష్కరణలను అన్వేషించడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి, అవకాశాల సరిహద్దులను పునర్నిర్వచించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తోడ్పడుతోంది.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్ సీఐ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ ఇంజనీర్లకు ఆవిష్కరణ, నిరంతర అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ రావు తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.

భవిష్యత్తు అనేది ఆవిష్కరణలను స్వీకరించే, వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతికతను అన్వయించే వారిదే. హవానా వంటి కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యాలను పదును పెట్టడమే కాకుండా విద్యారంగం, పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. విద్యార్థులు హ్యాకథాన్లు, పేపర్ ప్రెజెంటేషన్లు, వర్క్ షాపుల వంటి పోటీల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.షోలాపూర్ లోని ఎన్ కే ఆర్చిడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బీ.దఫేదార్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో పరిశ్రమ సమస్యలతో నిమగ్నమవ్వాలని ప్రోత్సహించారు. విజయానికి నాలుగు మంత్రులంటూ- ఆన్ లైన్ వనరులను ఒడుపుగా వినియోగించుకోవడం, నైపుణ్య అభివృద్ధిని మెరుగు పరచుకోవడం, పరిశ్రమ పరస్పర చర్యను పెంపొందించడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమని చెప్పారు.

విద్యార్థులు, సాంకేతిక ఔత్సాహికులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఉత్తేజకరమైన సవాళ్లతో పోటీ పడటానికి, విభిన్న సాంకేతిక డొమైన్లలో అంతర్దృష్టితో కూడిన జ్జాన-భాగస్వామ్య సెషన్లలో పాల్గొనడానికి హవానా ఒక అసాధారణ వేదికగా పనిచేస్తోంది. తదుపరి తరం ఆవిష్కర్తలను ప్రేరేపించడానికి, శక్తివంతం చేయడానికి రూపొందించబడిన పోటీలు, ఆచరణాత్మక వర్క్ షాపులు, ప్రదర్శనలు, నెట్ వర్కింగ్ అవకాశాలకు ఈ ఉత్సవం ఓ వేదికగా తోడ్పడుతోంది.హవానాలో భాగంగా, డ్రోన్ రేసింగ్, రోబో రేస్, లైన్ ఫాలోవర్స్, కోడెథాన్, ప్రోటో ఎక్స్ పో, గ్రిప్పర్ బాట్ ఛాలెంజ్, రోబో రెజ్లింగ్, 24 గంటల హ్యాకథాన్, రెప్లికా ఛాలెంజ్, పేపర్-పోస్టర్ ప్రెజెంటేషన్, రోబో సాకర్ వంటి పలు ఆకట్టుకునే పోటీలు జరిగాయి. వీటిని మించి, నైపుణ్య అభివృద్ధిలో హవానా కీలక పాత్ర పోషించింది. కృత్రిమ మేధస్సు, బ్లాక్ చెయిన్, రోబోటిక్స్ వంటి పరివర్తన సాంకేతికతలపై లోతైన అవగాహనను కల్పించింది. ప్రముఖ పరిశ్రమల నిపుణులు, పలు కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి చర్చించే వీలు, కొత్త పరిచయాలు ఏర్పరడానికి దోహదపడింది. అంతేగాక, కెరీర్ అవకాశాలను కూడా అందించింది.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి అధ్యక్షత వహించగా, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి స్వాగతోపన్యాసం చేశారు. దేశ నలుమూలల నుంచి 40 కళాశాలలకు చెందిన 150 బృందాలు ఈ పోటీలలో పాల్గొంటున్నట్టు చెప్పారు. జీ-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం. సాయికృష్ణ స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ కార్యకలాపాలపై నివేదికను సమర్పించగా, ఉపాధ్యక్షుడు జి. శౌరీ జేమ్స్ వందన సమర్పణ చేశారు. అధ్యాపకుడు ఎం. నరేష్ కుమార్ కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు. శుక్రవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago