– గీతమ్ ఘనంగా ‘ జాతీయ గణాంకాల దినోత్సవం ‘
మనవార్తలు ,పఠాన్ చెరు:
గణితం లేకుండా గణాంకాలు ఉండవని , గణాంకాల పరిజ్ఞానం ముఖ్యమని , అయితే ఉపాధికి నెపుణ్యాలు ఎంతో అవసరమని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్ శర్మ అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్ నిర్వహించిన ‘ జాతీయ గణాంకాల దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . గణాంకాలు మనదేశంలో పాదుకొని , పురోభివృద్ధి చెందడానికి ఎంతో కృషిచేసిన ప్రొఫెసర్ పీసీ మహలోబిస్ సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు . రోజువారీ జీవితంలో గణాంకాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఆయన జయంతిని ‘ జాతీయ గణాంకాల దినోత్సవం’గా జరుపుకుంటున్నట్టు వివరించారు .
ఈ సందర్భంగా సర్ రోనాల్డ్ ఎ ఫిషర్ , సీఆర్ రావు , వాల్టర్ ఎ.పెనార్డ్ సేవలను కూడా ఆయన స్మరించుకున్నారు . నిర్ణయం తీసుకోవడం జీవితంలో ఒక భాగమని , దానికి గణాంకాలు ఎంతగా ఉపకరిస్తాయో ఆయన విడమరిచి చెప్పారు . అంతేగాక , పెట్టుబడి నిర్ణయాలు , మార్కెట్ విశ్లేషణ , కొత్త ఉత్పత్తి అభివృద్ధి , వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం , వ్యాపార ప్రకటనల పరిశోధన , ఆర్థిక లావాదేవీల భద్రత , మానవవనరుల ప్రణాళిక కోసం వ్యాపార రంగంలో గణాంకాలను వినియోగిస్తారని ప్రొఫెసర్ కేవీఎస్ పేర్కొన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కేఎన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమం , సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి వందన సమర్పణతో ముగిసింది . గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా , ప్రొఫెసర్ బి.ఎం. నాయుడు , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…