Telangana

గీతంలో ఘనంగా నవరాత్రి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో విద్యార్థులు బతుకమ్మ, నవరాత్రి సంబరాలను ‘జష్ను-ఎ-బహారా’ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, హాజరైన వారికి శాశ్వత జ్జాపకాలను మిగిల్చింది.తొలుత, బతుకమ్మ తయారీతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పూల పండుగ స్ఫూర్తితో అందమైన సాంప్రదాయ పూల అలంకరణలను రూపొందించారు. ఆ తరువాత రంగోలి పోటీలో ఉత్సాహభరితంగా పాల్గొని, తమ సృజనాత్మకతను క్లిష్టమైన రంగోలీ డిజైన్ల ద్వారా ప్రదర్శించి, పండుగ వాతావరణాన్ని సృష్టించారు.విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, ఫుడ్ స్టాల్స్ రుచికరమైన వివిధ రకాల వంటకాలను అందించి, విభిన్నమైన వంటల ఆనందాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పించాయి. ఇక చివరగా, ఈ వేడుకలను మరపురాని గర్బా నైట్ తో ముగించారు. ఇక్కడ విద్యార్థులు నవరాత్రి పండుగ లయకు అనుగుణంగా నృత్యం చేస్తూ, మైమరచిపోయారు.సాంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ స్ఫూర్తిని కలిపి ‘జష్ను-ఎ-బహారా’లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మారింది.

 

admin

Recent Posts

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

1 day ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

4 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

4 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

4 days ago

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

4 days ago

దేవాలయ భూమిని కాపాడండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…

4 days ago