Telangana

గీతంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) హైదరాబాదులోని లైఫ్ సైన్స్ విభాగం ‘ఆహార శుద్ధి సాంకేతికతల ద్వారా పోషకాహార భవిష్యత్తును తీర్చిదిద్దడం’ అనే ఇతివృత్తంతో ‘ఫుడ్ టెక్నో ఫెస్ట్ 2026’తో జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంది.

ఈ కార్యక్రమంలో, మైసూరులోని సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్, ‘ఆహార శుద్ధి ద్వారా ప్రపంచ పోషకాహార అవసరాలను తీర్చడం’ అనే అంశంపై ప్రసంగించారు. సమతుల్య పోషకాహారం, బాధ్యతాయుతమైన ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార నిల్వ, ప్రత్యామ్నాయ ప్రోటీన్లు, విలువ జోడింపు, జీర్ణ వ్యవస్థ పనితీరు (గట్ హెల్త్) ప్రాముఖ్యతలను ఆమె వివరించారు. ఆహార నష్టాన్ని తగ్గించడానికి, ప్రపంచ పోషకాహార సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న ఆహార సాంకేతికతల సామర్థ్యాన్ని వివరించారు.

హైదరాబాదులోని MANE టెక్నికల్ డైరెక్టర్ (పరిశోధన, అభివృద్ధి) దేబాశిష్ మొహంతి, ‘వినియోగదారుల ఆధారిత ఉత్పత్తి వ్యూహాలు – విభజన, ప్రాధాన్యత విశ్లేషణ’ అనే అంశంపై ప్రసంగించారు. వినియోగదారుల అంతర్దృష్టులు, ప్రాధాన్యతల విశ్లేషణ, విభజన, ఉత్పత్తి ధ్రువీకరణ అనేవి సందర్భోచితమైన, సుస్థిరమైన, వాణిజ్యపరంగా విజయవంతమైన ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఎలా సహాయపడతాయో విడమరచి చెప్పారు.

తొలుత, గీతం విశిష్ట ఆచార్యుడు డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ స్వాగతోపన్యాసం చేసి, ఈ కార్యక్రమానికి నాంది పలికారు. జీఎస్ఎస్ విద్యార్థులు పోస్టర్ ప్రజెంటేషన్లు, నమూనాల తయారీ, వినూత్న ఆహార ఉత్పత్తి అభివృద్ధి పోటీల ద్వారా తమ సృజనాత్మకతను, శాస్త్రీయ పరిజ్జానాన్ని ప్రదర్శించారు. తద్వారా ఆహార శాస్త్రం, వ్యవస్థాపకతలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అవకాశాలపై ఆచరణాత్మక అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ డాక్టర్ జి. నిహారిక, కో-కన్వీనర్ డాక్టర్ ఎం. సురేంద్ర బాబు పర్యవేక్షణలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకులు సమన్వయం చేశారు.

admin

Recent Posts

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

57 minutes ago

మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…

59 minutes ago

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి  నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…

1 hour ago

యుక్తితో, నేర్పుగా వ్యవహరించాలి

ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…

1 hour ago

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

1 day ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

1 day ago