– పత్ర సమర్పణకు తుదిగడువు : అక్టోబర్ 28
మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎసాహెచ్ఎస్ ) హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ భారతీయ నేపథ్యంలో సామాజిక ఆర్థిక రంగాల నుంచి మహమ్మారి – ఆధారిత సంక్షోభాలకు బహుముఖ ప్రతిస్పందనలు , స్థితిస్థాపకత ‘ అనే అంశంపై నవంబర్ 24-25 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది ప్రాంతీయ కేంద్రం , హెదరాబాద్ సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామని సోమవారం విడుదల చేసిన ఒక పేర్కొన్నారు . ఈ సదస్సులో సంబంధిత అంశాలపై విద్యాపరంగా చర్చల ద్వారా భారతీయ సమాజంలోని అన్ని రంగాల నుంచి ప్రతిస్పందనలను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు . మహమ్మారి కష్టాలు , సవాళ్లపై పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నామని , గ్రామీణ వినియోగం , జీవనోపాధిపై మహమ్మారి ప్రభావం , వ్యవసాయం పాత్ర , మహామ్మారి సమయంలో ప్రజారోగ్యం , విద్యాసాధన వంటి పలు ఇతరత్రా ఇతివృత్తాలపై సత్ర సమర్పణ చేయొచ్చన్నారు .
తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్ . లింబ్రాద్రి ముఖ్య అతిథిగా , జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజిత్ మజుందార్ , బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీఆర్ఎన్ఆర్ భానుమూర్తి ప్రధాన వక్తలుగా ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొంటారని తెలియజేశారు . సాంఘిక శాస్త్ర పరిశోధకులు , విద్యావేత్తలు , విధాన నిపుణులు , అభ్యాపకులు , ప్రభుత్వ – ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు . అమూర్త ( అబ్ స్టాక్ట్ ) పత్రాలను అక్టోబర్ 28 లోగా సమర్పించాలని , ఎంపిక చేసిన వాటిని 7 నవంబర్ 2022 న ప్రకటిస్తామని తెలిపారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ మందర్ వి.కులకర్ణి 81058 72210 ని సంప్రదించాలని లేదా mkulkarn@gitam.edu కు ఈమెయిల్ చేయాలని సూచించారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…