మనవార్తలు ,పటాన్ చెరు;
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఆగస్టు 5 , 2022 న ‘ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ ‘ ( సీపీపీఎస్ -2022 ) పై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ‘ డేటా సెన్స్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ఫ్లెక్సిబుల్ ప్రొడక్షన్ ‘ నేపథ్యంలో దీనిని నిర్వహించనున్నట్టు తెలిపారు . సీఎస్ఐఆర్ సౌజన్యంతో , భారత ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ శాఖ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామన్నారు . ఆరోగ్య సంబంధిత ఏఐ వినియోగం ప్రాథమిక లక్ష్యం క్లినికల్ టెక్నిక్లు , రోగి ఫలితాల మధ్య సంబంధాలను విశ్లేషించడమని ఆయన చెప్పారు .
ఇండస్ట్రియల్ ఫ్లెక్సిబుల్ మాన్యుప్యాక్చరింగ్ సిస్టమ్ ( ఎఫ్ఎంఎస్ ) రోబోట్లు , కంప్యూటర్ – నియంత్రిత యంత్రాలు , ఉత్పాదక పరిశ్రమల ఉత్పత్తి విభాగంలో రోబోట్ల ఉపయోగం , అధిక వినియోగం నుంచి అధిక ఉత్పాదకత వరకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని ఆయన వివరించారు . అమూర్త పత్రాలను రాతపూర్వకంగా సమర్పించాలని , ఫార్మాస్యూటిక్స్ – బయో – ఫార్మాస్యూటిక్స్ , అధునాతన , ఎంపికచేసిన ఔషధాల రవాణా , నానోటెక్నాలజీ – నానోమెడిసిన్ , ఫెట్రోకెమిస్ట్రీ వంటి వివిధ రంగాలలో పరిశోధనలు చేస్తున్న వారినుంచి నీటిని ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ వెల్లడించారు . ఆసక్తిగల అభ్యర్థులు అమూర్త పత్రాలను జూలై 18 వ తేదీలోగా సమర్పించాలని , జూలై 20 లోగా పేర్లు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు . ఇతర వివరాల కోసం డాక్టర్ కింగ్స్టన్ రాజయ్య , నిర్వాహకుడు , 09257 , krajiah@gitam.edu కు లేదా డాక్టర్ జితేందర్ పాటిల్ , నిర్వాహక కార్యదర్శి jpatel@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…