– మార్చి 28,29 లలో సమ్మె
మనవార్తలు , పటాన్ చెరు:
మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల పార్లే కార్మికుల గేట్ మీటింగ్ లో రాజయ్య మాట్లాడుతు కార్మిక పోరాటాలతో హక్కులు సాధించుకోవచ్చని, మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని, మోడీ విధానాల పైన దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా కాకుండా కార్మికులు గా చూడాలని కార్మికులను బానిసలుగా మార్చే 4 నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల ను విస్మరించి పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని, దేశ సంపదను సృష్టించే స్తోమత కార్మికులకు ఉందన్నారు.
దేశ అభివృద్ధిలో కార్మిక కర్షకుల పాత్ర కీలకమని అలాంటి వారికిభద్రత కల్పించాల్సిన ప్రభుత్వం పెట్టుబడిదారులకు బానిసగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశాన్ని దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ఆరోపించారు. కార్మిక కర్షకులు ఐక్యతతో పోరాడితే హక్కులు సాధించుకోవాలని అన్నారు. పెట్టుబడిదారుల చేతి నుండి దేశాన్ని రక్షించుకోవాలని. విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జహింగీర్, సంతోష్, కిరణ్, జంగయ్య, సురేందర్ లు పాల్గోన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…