Telangana

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

_సీఎం కేసీఆర్ ఆశీర్వాదం.. ప్రజల అభిమానం..హ్యాట్రిక్ విజయానికి నాంది..

_ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో

_గడపగడపకు సంక్షేమ పథకాలను వివరిస్తాం.. ఓటును అభ్యర్థిస్తాం..

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదం..పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభిమానంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గడపగడపకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం హైదరాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్నారు.పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్దా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంబరాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గాన్ని గత పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఆదర్శప్రాయంగా నిలిపామని తెలిపారు. ప్రతి ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించి పల్లెలను ప్రతీ బాటలో పయనింప చేశామని తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో రెండుసార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయాన్ని అందించి సీఎం కేసీఆర్ కు కానుకగా అందిస్తామని తెలిపారు.

ఇది ప్రజల మేనిఫెస్టో..

రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం అలుముకున్న చీకటిని పారద్రోలే విధంగా పాలసీలు రూపొందించి.. పదేళ్లలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. పెరిగిన సంపదను ప్రజలకు పంచాలన్న లక్ష్యంతో మేనిఫెస్టో రూపొందించారని తెలిపారు.హామీ ఇస్తే అమలు చేసే వరకు నిద్రపోని వ్యక్తిత్వం గల సీఎం కేసీఆర్.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago