Telangana

మహిళ చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గడిలపై గళమెత్తి, తెలంగాణ రాష్ట్రంలో భూ పోరాటానికి నాంది పలికి, మహిళా చైతన్యానికి ప్రత్యేకగా నిలిచిన చాకలి ఐలమ్మ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించి మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ పేరును హైదరాబాదులోని మహిళా విశ్వవిద్యాలయానికి పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారి వారసులకు సైతం సమచిత గౌరవం కల్పించారని పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై అతి త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు అఫ్జల్, రజక సంఘం అధ్యక్షుడు మహేష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

9 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago