Telangana

పెన్నార్ కార్మిక లోకానికి సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెన్నార్ బిఆర్టియు నాయకులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

శనివారం జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తమ హ్యాట్రిక్ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బి ఆర్ టి యు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి మిఠాయిలు తినిపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత మూడు పర్యాయాలుగా బి ఆర్ టి యు నాయకత్వాన్ని బలపరిచి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన పెన్నార్ పరిశ్రమ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కార్మిక నాయకులకు సూచించారు. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కార్మికుల భవిష్యత్తుకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు, పెన్నార్ పరిశ్రమ అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ, పెన్నార్ పరిశ్రమ కార్యనిర్వాహక అధ్యక్షులు యాదగిరి యాదవ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago