Telangana

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:

జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించేలా నూతన ఆలయాలు నిర్మించడం హర్షించదగ్గ విషయం అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 200లపైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయానికి గతంలోనే 16 లక్షల రూపాయల విరాళం అందించడం జరిగిందని.భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శివ భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయం పరిధిలో సన్నిధానం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago

శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు ఘన సన్మానం

– ఘనంగా నిర్వహించిన భాగ్యనగర్ శివాజీ సేవాసమితి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్న…

3 days ago