పటాన్చెరు:
75 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని, జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. రామచంద్రపురం జిహెచ్ఎంసి కార్యాలయం, పటాన్చెరు పట్టణంలోని తెలంగాణా అమరవీరుల స్థూపం,జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, మైత్రి మైదానం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపిడిఓ, తహసిల్దార్, ఆత్మ కమిటీ, ఆటో యూనియన్, గ్రంథాలయం కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశం అన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందించాలని మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని అన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి తో సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, తహశీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపిడిఓ బన్సిలాల్, బల్దియా డిప్యూటీ కమీషనర్ బాలయ్య, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిదులు, పట్టణ పుర ప్రముఖులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…