_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తక్షణమే తాహెర్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనల మేరకు స్వయంగా ప్రవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి, మూడు లక్షల రూపాయల వ్యయంతో శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. గురువారం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు.నమ్ముకున్న నాయకుడు తన కష్టాల్లో అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని తాహెర్ తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…