Telangana

పనిమంతునికే పట్టం కట్టాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కలెక్టర్ గా ,జాయింట్ కలెక్టర్ గా పనిచేసి, విశేష అనుభవం కలిగిన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి విజయానికి సహకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి తో కలిసి పటాన్చెరు డివిజన్ లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ మాదిరి జైపాల్, మాజీ కార్పొరేటర్లు సపాన్ దేవ్, శంకర్ యాదవ్, ప్రతాప్ సేటు తదితరులను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనారంగంలో ఎంతో అనుభవం ఉన్న వెంకట్రామరెడ్డి ఎంపీ గా గెలిస్తే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు..ఎంపీ గానే కాకుండా స్వంత గా 100 కొట్ల తో ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి జాబ్ మేళా ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు..అలాగే నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి శుభకార్యాలకు అందించడం జరుగుతుందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, 6 గ్యారంటీలు ఆటకెక్కాయన్నారు..బీజేపీ తెలంగాణ కు చేసిందేమీ లేదన్నారు..మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దని, పనిమంతుడైన వెంకట్రామరెడ్డి కి మద్దతు తెలుపాలన్నారు. మన లోకల్ నివాసి, తెల్లాపూర్ కు చెందిన వెంకట్రామరెడ్డి కి ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించాలని కోరారు..మాయ మాటలు రావని, మాట తప్పే వాణ్ణి కాదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి తెలిపారు. పఠాన్ చెరు ప్రాంతంలో ఉన్న సమస్యలపై, వాటి పరిష్కారంపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు..ఈ ప్రాంత సమస్య లపై పార్లమెంటు లో గళమెత్తుతానన్నారు..ఈ ప్రాంత వాసిగా , ప్రజా సేవ కోసం వస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

5 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

7 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago