Telangana

సమావేశాలకు పూర్తి వివరాలతో హాజరు కావాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,అమీన్పూర్:

మూడు నెలలకు ఒకసారి ప్రజల సమస్యలపై చర్చించే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శనివారం అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వచ్చిందని, క్షేత్రస్థాయిలో పొరపాట్లు లేకుండా సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనుల విషయంలో నిధులు లేవని సాకులు చెప్పొద్దని, ఉన్నత అధికారులు, సంబంధిత మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఉద్యానవన శాఖ సమీక్ష సందర్భంగా మండలంలో చేపడుతున్న పనుల వివరాలను తెలపాలని సంబంధిత అధికారి శైలజను ఎమ్మెల్యే సూచించగా, పూర్తి వివరాలు తీసుకుని రాలేదని సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలిచి మండల పరిషత్ సమావేశాలకు అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐలాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు బీమా ద్వారా ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయల చెక్కును స్థానిక ప్రజాప్రతినిదుల ద్వారా రైతు కుటుంబానికి అందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిదులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో మల్లీశ్వర్, తహసిల్దార్ విజయకుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago