పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం కోసం స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి ఎం ఆర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో సొంత స్థలం కలిగి ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితులను దళారులను ఆశ్రయించవద్దని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో మాడల్ హౌస్ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో సొంతింటి కలను సహకారం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఐలేష్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…