MAHIPAL-REDDY
నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆర్థిక పునరావాస పథకం ద్వారా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఐదుగురు వికలాంగుల లబ్ధిదారులకు మంజూరైన 50 వేల రూపాయల చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక పునరావాస పధకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీతో కూడిన 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆయా మండలాల ఎంపీపీ లు దేవనందం, రవీందర్ గౌడ్, జెడ్పీటీసీ లు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపిడిఓలు, ఆయా గ్రామాల సర్పంచులు, అంగన్వాడీ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, వెంకటేశ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రమోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…