Telangana

గణేష్ గడ్డ వినాయక దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని గురువారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలందరి సహకారంతో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన కాలమానిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు డిఎస్పి ప్రభాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, సిఐలు వినాయక రెడ్డి, నరేష్, రవీందర్ రెడ్డి, రమణా రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు రాజు, వెంకన్న, నరసింహ రెడ్డి, నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago