పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావును పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరామర్శించారు. ఇటీవల హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ గారు మరణించిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి కోకాపేటలోని హరీష్ రావు నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం హరీష్ రావును ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాండు, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…